West Indies Tour Of India 2014 : Dwayne Bravo Opens Up On India Tour Debacle | Oneindia Telugu

2018-11-17 218

Former West Indies allrounder Dwayne Bravo, opened up on the 2014 India tour debacle, in an exclusive interview
#DwayneBravo
#WestIndies
#bcci
#WestIndiesCricketBoard

నాలుగేళ్ల క్రితం భారత్ పర్యటనకు వచ్చిన వెస్టిండీస్‌ క్రికెట్‌ జట్టు సిరీస్‌ను అర్థాంతరంగా ముగించుకుని స్వదేశానికి పయనమైన సంగతి తెలిసిందే. భారత్‌తో నాలుగు వన్డేల జరిగిన తర్వాత ఐదో వన్డే ఆడే క్రమంలో ఆ జట్టు పర్యటనకు స్వస్తి పలికింది. వెస్టిండీస్‌ క్రికెట్ బోర్డుతో ఆ దేశ క్రికెటర్లకు కాంట్రాక్ట్‌ విషయంలో విభేదాలు నెలకొనడంతో భారత పర్యటన అర్ధాంతరంగా ముగిసింది. అయితే ఆనాడు చోటు చేసుకున్న పరిస్థితులను తాజాగా ఆ దేశ్ క్రికెటర్ డ్వేన్‌ బ్రేవో గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో తమ క్రికెట్‌ బోర్డుతో నెలకొన్న విభేదాల కారణంగా తాము పెద్ద మొత్తంలో నగదును కోల్పోయి పరిస్థితే వస్తే, అందుకు బీసీసీఐ నుంచి ఊహించని మద్దతు లభించిందని చెప్పుకొచ్చాడు.